సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించి..ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశాన్ని అందించిన మహోన్నత నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు శాసన సభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గురువారం గాంధీ జయంతి రోజున ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయకంగా నిలుస్తాయని తెలిపారు. నేటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన దేవి మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published On: October 2, 2025 11:23 am