స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రంగం అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని, తమ ఏరియాలో గల పోలింగ్ స్టేషన్స్, లొకేషన్ లను సందర్శించి, పరిస్థితులను సమీక్షించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వాహణే లక్ష్యంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా యుతంగా వ్యవహరించాలని అన్నారు. ఎస్.హెచ్.ఓలు, తమ ఏరియాలో గల అన్ని పోలింగ్ లొకేషన్స్, పోలింగ్ స్టేషన్స్, లను సందర్శించి, పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెటకుండా అన్నిరకాల ఏర్పాట్లను చేయించాలన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, వారిని సత్:ప్రవర్తన కోరుతూ ముందస్తూ బౌండ్ ఓవర్ చేయాలని, ఎన్నికలను ప్రభావిత చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీలు నిర్వహించాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారి తమ కేటాయించిన గ్రామలపై పూర్తి అవగాహన కలిగి ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించడంలో పోలీసులుగా మన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం, యువతకు క్రికెట్ కిట్ లు మొదలగు ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పకడ్బందీగా చేపట్టాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలకు దిగిన సంబంధిత వ్యక్తులపై యం.సి.సి ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఇన్స్పెక్టర్స్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, రమేష్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now