స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

➤ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

మొదటి విడత: అక్టోబర్ 9న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 23న పోలింగ్

రెండో విడత: అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 27న పోలింగ్

కౌంటింగ్: నవంబర్ 11న

➤ గ్రామపంచాయతీ ఎన్నికలు

ఫేజ్ 1: అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు అదే రోజు

ఫేజ్ 2: అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు అదే రోజు

ఫేజ్ 3: అక్టోబర్ 25న నామినేషన్లు, నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు అదే రోజుసందడి

స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి వాతావరణం నెలకొననున్నది.

Join WhatsApp

Join Now