స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో, ఎన్నికలు సజావుగా జరగడానికి కాలసిన అన్నిరకాల ముందస్తూ ఏర్పాట్లను చేసుకోవాలని వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్స్, ఎస్పీలతో ఎస్టేట్ ఎన్నికల కమిషన్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్ని రకాల ముందస్తూ.. ఏర్పాట్లను చేసుకోవాలని, గత ఎన్నికలలో చెడు నడత కలిగిన వారిని సత్:ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని అధికారులకు సూచించారు. యస్.హెచ్.ఓ.లు తమ ఏరియాలో గల పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో ఉండవలసిన కనీస వసతుల గురించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొని ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల నుండి ఎన్నికలను ప్రభావితం చేసే ఏ ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేదని, అంతర్ రాష్ట్రా, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పొస్తలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఎన్నికలను ప్రభావితం చేసే, పార్టీలను గాని, వ్యక్తులను గాని కించ పరిచేలా వ్యాకయ్యలు చేసిన, పోస్టులు పెట్టిన సంబంధిత వ్యక్తులపై, గ్రూప్ అడ్మిన్ లపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అధికారులు సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ లలో ఉండాలని, ఏ చిన్న సంఘంటన జరిగిన త్వరితగతిన స్పందించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.

Join WhatsApp

Join Now