సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ,గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అసౌకర్యానికి గురికాకూడదని కలెక్టర్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 4, 2025 5:43 pm