నాగిరెడ్డి పేట్, అక్టోబర్ 4, (ప్రశ్న ఆయుధం):
ఎన్నికల వేళ ఎల్లారెడ్డి మరియు నాగిరెడ్డిపేట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. నాగిరెడ్డిపేట్ మండలం లింగంపల్లి కలాన్ మాజీ సర్పంచ్ నీరుడి రాజు మరియు మాసన్ పల్లి మాజీ సర్పంచ్ చెట్టుకింది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానం పలికారు.
చేరిక కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు బాలరెడ్డి, గంగారెడ్డి, విక్రాంత్ రెడ్డి, బండ బాబు, భాస్కర్ రెడ్డి, మధు, లచ్చిగారి రవిందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామంతో నాగిరెడ్డిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
“చేరికలతో మారే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో”…
🫵ప్రశ్నలు… ప్రజా చర్చలో!
👉మాజీ సర్పంచ్ల విడిపోవడం బీఆర్ఎస్లో అసంతృప్తికి సంకేతమా?
👉కాంగ్రెస్ కొత్త జాయినింగ్స్ ఓటర్లపై ప్రభావం చూపగలవా?
👉మదన్ మోహన్ నేతృత్వంలో కాంగ్రెస్ బలపడుతోందా లేక ఇది ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనా?
👉వరుస షాక్‌లు బీఆర్ఎస్ భవిష్యత్తుకు ముప్పా?
✍️ సమాధానం మాత్రం… ఓటర్ల చేతుల్లోనే ఉంది.