*గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి*

నిజామాబాద్ నవంబర్ 19 (ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ నందు తేదీ 10-11-2025 రాత్రి 9 గంటలకు నిజామాబాద్ కిసాన్ గంజ్ మార్కెట్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి కింద పడి ఉండగా పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్ కు చికిత్స గురించి తరలించినారు .వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి అడ్మిట్చేశారు .GGH హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తేదీ:15/11/25 రోజు ఉదయం 11 గంటలకు మృతి చెందినట్లు నిర్ధారించారు.అతని వయసు సుమారు 55నుండి 60 వరకు ఉంటుంది .అతని పైన బట్టలు అరేంజ్ రంగు ఫుల్ షర్ట్ మరియు బ్లాక్ రంగు ప్యాంట్ కలదు . వ్యక్తి వాలకం బట్టి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది, ఇతని యొక్క జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నందు సంప్రదించగలరని ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ బి రఘుపతి తెలిపారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712659714.

Join WhatsApp

Join Now

Leave a Comment