సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 101మద్యం దుకాణాలకు సంబంధించి 2025-27 మద్యం పాలసీకి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు వివరాలు.. సంగారెడ్డి స్టేషన్ పరిధి – 24, పటన్ చెరు – 35, జహీరాబాద్ – 16, నారాయణఖేడ్ –13, అందోల్ – 13, మొత్తం 101, దుకాణాలు. వీటిలో ఎస్.టి. 2, ఎస్.సి. 13, గౌడ కులస్తులకు 9 రిజర్వేషన్ కల్పించబడిందని తెలిపారు. ఈ దుకాణాల కేటాయింపును జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా ద్వారా చేపడతారని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 18 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం లేదా నాంపల్లి లోని కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చుని తెలిపారు. డ్రా అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపల్లిలోని జె.ఎన్.ఆర్. గార్డెన్, ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడనుందని చెప్పారు. దరఖాస్తుదారులు రూ. 3 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ను డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సజ్ ఆఫీసర్, సంగారెడ్డి పేరుమీద సమర్పించాలని అన్నారు. మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు తప్పనిసరిగా జతచేయాలని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీకి దరఖాస్తు చేసే వారు ప్రభుత్వంచే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం లేదా స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం నంబర్లు.. జిల్లా అధికారి – 8712658904, జిల్లా సహాయ అధికారి – 8712658907, సంగారెడ్డి సీఐ – 8712658912, పటాన్ చెరు సీఐ – 8712658913, జహీరాబాద్ సీఐ – 8712658914, నారాయణఖేడ్ సీఐ — 8712658915, అందోల్ సీఐ – 8712658916 సంప్రదించాలని అన్నారు. సమయానికి పూర్తి పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర సూచించారు.
2025-27 మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర
Published On: September 27, 2025 8:51 pm