సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరులో ఈ నెల 15న ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహిస్తున్నామని కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి మీద ప్రకృతి ఇచ్చిన వరం గాలి అని, మనం పీల్చే గాలిలో ఎంత నాణ్యత ఉందో ప్రతి ఒక్కరికీ అవగాహన కలగాలని అన్నారు. ఈ ఉద్దేశంతో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున ఉదయం 6 గంటలకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన 2కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు పేరు నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 8074519163ను సంప్రదించాలని మాదిరి ప్రిథ్వీరాజ్ కోరారు.