బీసీల 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సత్యాగ్రహ దీక్ష చేయడానికి సంసిద్ధంగా ఉండాలి: న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్

సంగారెడ్డి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీల 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సత్యాగ్రహ దీక్ష చేయడానికి సంసిద్ధంగా ఉండాలని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యగ్రహ దీక్ష చేపట్టడం చరిత్ర గుర్తించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలు, బీసీ సంఘాల నాయకులు, సుమారు 144 కుల సంఘాల బీసీ నాయకులు, రాజకీయ నేతలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment