ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సాయి భాస్కర్‌కు సన్మానం

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి భాస్కర్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సాయి భాస్కర్ ను బ్రాంచ్ మేనేజర్ నాగలక్ష్మి, గోల్డ్ లోన్ ఆఫీసర్ భాస్కర్, క్యాషియర్ ఊహ, దేవేందర్, హరిందర్ తదితరులు శాలువాతో సన్మానించారు. అదేవిధంగా నర్సాపూర్ మొబైల్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు గున్నాల గోపిగౌడ్ పాల్గొని ఫీల్డ్ ఆఫీసర్‌ సాయి భాస్కర్ శాలువాతో సన్మానించి, సేవలను ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment