శ్రావణ సోమవారం సందర్బంగా మహాశివునికి అభిషేకాలు

*ఘనంగా నిర్వహించిన రామకోటి రామరాజు దంపతులు*

*శ్రావణమాసం అంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న రామకోటి సంస్థ*

సిద్దిపేట/గజ్వేల్, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్):శ్రావణ మాసం సోమవారం సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద మహాశివునికి పంచామృత అభిషేకాలు సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రావణమాసం భక్తికి చాలా శ్రేష్టమైన మాసం అన్నారు. మనిషిగా పుట్టడం చాలా గొప్ప విషయం అన్నారు. మళ్ళీ మళ్ళీ మానవ జన్మ దొరుకుతుందని కూడా ఎవ్వరము చెప్పలేమన్నారు. పుట్టడము ఎలాగో మన చేతిలో లేదు మరి చావడం మన చేతిలో ఉందా అంటే అది కూడా లేదన్నారు. ఏ సమయం ఎలా వస్తుందో కూడా తెలియదన్నారు. అందుకే భగవన్నామాన్ని స్మరించాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now