సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలో తెలంగాణ వీరభద్రీయ కుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. కుల సంఘాల భవనాలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని, వీటి వల్ల యువతలో చైతన్యం పెంపొంది, సంఘం అభివృద్ధికి దోహదపడతారని అన్నారు. భవిష్యత్తులో ఈ భవనాలు సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రబిందువులుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరభద్రీయ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముత్తంగి వీరభద్రీయ సంఘం భవన శంకుస్థాపనలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: August 6, 2025 4:14 pm