మెదక్/నార్సింగి, ఆగస్టు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన్ మోడల్ పాఠశాలలో శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సోదరభావం, స్నేహం ప్రతిబింబించే విధంగా ఒకరికి ఒకరు రాఖీలు కట్టారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో బాలికలు బాలురకు రాఖీలు కట్టారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. రాఖీ పండుగ మన సంప్రదాయాల్లో ముఖ్యమైనదని, ఇది సోదరుడు–సోదరికి మధ్య ఉన్న ప్రేమ, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసులోనే పరస్పర గౌరవం, అనుబంధం, ఐక్యత వంటి విలువలను అలవరుచుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం ఆనందం, స్నేహపూర్వక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.