సంగారెడ్డి/పటాన్చెరు, ఆగస్టు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సామాజిక సమానత్వం కోసం శక్తివంతంగా పోరాడిన ప్రజల యోధుడు పండుగ సాయన్న అని బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్లో స్వాతంత్ర్య సమరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న నాటి దొరల పాలనను ధైర్యంగా ఎదిరించి, ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు. ఆయనను ‘తెలంగాణ రాబిన్ హుడ్’, ‘బహుజన బందూక్’గా గౌరవించడం గర్వకారణం అని, ఆయన జీవితం యువతకు ప్రేరణగా నిలవాలనీ తెలిపారు. అనంతరం సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎట్టయ్య, మాజీ అధ్యక్షుడు కుమార్, సత్యయ్య, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సామాజిక సమానత్వం కోసం శక్తివంతంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న: బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ముదిరాజ్
Published On: August 8, 2025 9:27 pm