ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు మొత్తం 40 దరఖాస్తులు అందాయని తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. అందిన ధరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తుపై రికార్డు నిర్వహణ చేపట్టి, ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యేవరకు ఫాలోఅప్ చేయాలని తెలిపారు. ప్రజల సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారం కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now