ఈనెల 15న పటాన్‌చెరులో కాలుష్య అవగాహన కోసం 2కె రన్: ఎండీఆర్ ఫౌండేషన్ కో–ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్):పటాన్‌చెరు పట్టణంలోని కొన్ని కాలనీలలో వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహిస్తున్నామని ఎండీఆర్ ఫౌండేషన్ కో–ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ఉదయం 6గంటలకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఈ 2కె రన్ ప్రారంభమవుతుందని అన్నారు. ఆసక్తి ఉన్న వారు పేరు నమోదు చేసుకోవాలని, ఇందుకోసం వాట్సాప్ నంబర్ 8074519163ను సంప్రదించవచ్చని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులవ్వాలని, ఈ కార్యక్రమానికి విస్తృతంగా హాజరై విజయవంతం చేయాలని ప్రిథ్వీరాజ్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment