సంగారెడ్డి, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనని జన్మభూమిచ్చ- జనని జన్మభూమిశ్చ కార్యక్రమం ద్వారా లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సాహిత్య పోటీలను నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన, ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్ రావు (దాత), ప్రోగ్రామింగ్ అధికారిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ యన్.రామప్ప పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. క్లబ్ పరిధిలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పుల్కల్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, పాటల విభాగాలలో పోటీలు నిర్వహించగా, మొత్తం 15 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్లు పి.రాములుగౌడ్, ఎస్.విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం అని తెలిపారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు త్వరలో బహుమతులు అందజేస్తామని వారు పేర్కొన్నారు
లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు
Published On: August 14, 2025 9:58 pm