నార్సింగిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మెదక్/నార్సింగి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నార్సింగి కల్లు డిపో వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయంలో సర్దార్ పాపన్నగౌడ్ జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో ఆనంద్, ఎస్ఐ సృజన, ఆర్ఐలు శ్రీధర్, మేఘనలను గౌడ సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్ గౌడ్, నాయకులు సిద్దాగౌడ్, స్వామిగౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, అంజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, సత్యంగౌడ్, యాదగిరి గౌడ్, బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment