నర్సాపూర్ లో ఘనంగా ఫోటోగ్రఫీ డే

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్) : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ దగీర్రె చిత్రపటానికి నర్సాపూర్ ఫోటోగ్రాఫర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా ఫోటోగ్రాఫిని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన పితామహుడు లూయిస్ దగీర్రె అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ కంది భూషణం, మండల అధ్యక్షుడు దినేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్నే భీమ్, కోశాధికారి చారి, ఉపాధ్యక్షులు సాగర్, పవన్, ఆదిత్య, లలిత్, నరహరి, హైమద్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment