సంగారెడ్డి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో పట్నం హోటల్ ను గంగా నర్సరీ చైర్మన్ ఐసీ.మోహన్, అనురాధ దంపతులు ప్రారంభించారు. బుధవారం సంగారెడ్డి బైపాస్ లో పట్నం హోటల్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా గంగా నర్సరీ చైర్మన్ ఐసీ.మోహన్, అనురాధ దంపతులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐసీ.మోహన్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలో మరొక మంచి హోటల్ ఏర్పడటం ఆనందకరమని పేర్కొన్నారు. ప్రజలకు రుచికరమైన తెలంగాణ వంటకాలు అందిస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామప్ప, పట్నం హోటల్ నిర్వాహకులు కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో పట్నం హోటల్ ను ప్రారంభించిన గంగా నర్సరీ చైర్మన్ ఐసీ.మోహన్
Published On: August 20, 2025 4:36 pm