సంగారెడ్డి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ..

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో డిటిసి పరిసరాల శుభ్రత, బ్యారేక్స్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిటిసి పరిసరాలు, లా క్లాస్ రూమ్స్ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. రిఫ్రెష్మెంట్ కోర్స్ లో భాగంగా శిక్షణకు వచ్చే జిల్లా సిబ్బందికి నాణ్యమైన శిక్షణను అందించే విధంగా ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ లు రెగ్యులర్ పరేడ్, డ్రిల్స్ ప్రాక్టీస్ లో ఉండాలని అన్నారు. ఫిజికల్ ట్రైనింగ్, లా క్లాస్ లను సమర్ధవంతంగా నిర్వహిస్తూ సిబ్బందికి నాణ్యతతో కూడిన శిక్షణను అందించాలని ఎస్పీ సూచించారు. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి డి.టి.సి.ప్రిన్సిపాల్ అదనపు.ఎస్పీ. శ్రీనివాస రావు, వైస్.ప్రిన్సిపాల్, డియస్పి. సురేందర్ రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆర్.ఐ. శ్రీనివాస్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment