భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహనీయుడు రాజీవ్ గాంధీ: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించి కొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టి కమ్యూనికేషన్ రంగంలో నూతన సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. భారతదేశంలో కంప్యూటర్ విప్లవానికి బీజంపోసింది రాజీవ్ గాంధీ అని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కంప్యూటర్ యుగానికి పెద్దపీట వేసి భారీ సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం వివిధ రంగాలలోనీ టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై ట్యాక్స్ లు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహనీయుడి సొంతమన్నారు. భారత దేశ అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధిలో మేటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment