మెదక్/నర్సాపూర్, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన శుభమ్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇటువంటి వాణిజ్య సముదాయాలు ఎంతో ఉపయోగకరమని, స్థానికులకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సరుకులు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో ఘనంగా శుభమ్ మార్ట్ ప్రారంభం
Published On: August 20, 2025 8:46 pm