సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ఖరీఫ్ వడ్ల కొనుగోలు సాఫీగా జరగడం కోసం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ మాధురి అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ, డిఆర్ డిఓ పీడీ, సహకార శాఖ, జిల్లా మార్కెటింగ్ శాఖ, రెవిన్యూ, వ్యవసాయ శాఖ, రైసమిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పలు విభాగాల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను సమీప గ్రామాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సహకార శాఖ, డిఆర్ డిఓ పీడీలను కొనుగోలు కేంద్రాల జాబితా వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతులు తమ వడ్లను సులభంగా అమ్ముకునేలా సదుపాయాలు కల్పించాలని, తూకం యంత్రాలు, గోడౌన్లు, తాత్కాలిక నిల్వ సదుపాయాలు వంటి మౌలిక వసతులు కూడా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను సమీప గ్రామాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మండలంలోని పంట సాగు పరిస్థితులు, పంటల వృద్ధి దశలు, అంచనా దిగుబడులపై స్పష్టమైన నివేదికను తయారు చేయాలని సూచించారు. రైతుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వాస్తవిక అంచనాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు ప్రతి రైస్ మిల్లును క్రమంతప్పకుండా సందర్శించాలని స్పష్టం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను గడువులోగా పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 12వ తేదీ లోపు కస్టమ్ మిల్లింగ్ రైస్ మొత్తం పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇంకా మిగిలిన సీఎంఆర్ డెలివరీ వెంటనే పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని, ఆలస్యం చేయరాదని ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, పౌర సరఫరాల శాఖ అధికారిణి బాలసరోజ, డిఆర్ డిఓ పీడీ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి, డిప్యూటీ తహసీల్దార్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్ వడ్ల కొనుగోలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్ మాధురి
Published On: August 23, 2025 8:28 pm