వన మహోత్సవం వంద శాతం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాంక్ ఏర్పాటు చేసి, ఆన్లైన్‌లో నమోదు తప్పనిసరి చేయాలని సూచించారు. ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం (హోమ్ షేడ్స్)ను కూడా సమగ్రంగా పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నాటిన ప్రతి మొక్క వృథా కాకూడదని, ప్రతి మొక్కను సంరక్షించడానికి బాధ్యత వహించాలని .వనమహోత్సవకార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేయాలనిఅన్నారు . ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం (హోమ్ షేడ్స్)ను కూడా సమగ్రంగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండు వారాల్లో పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ వ్యవస్థ అదుపులోకి తీసుకురావాలని అన్నారు.మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కలిసి వసతి గృహాలను జాయింట్‌గా పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలి, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాలలో మౌలిక అవసరాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వసతి గృహాలు, పాఠశాలలు, కాలనీల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి , వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ నిర్వహించారు .జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తో కలిసి మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య పిలుపునిచ్చారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని, కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు మట్టి గణపతులనే పూజించుకోవాలని సూచించారు. ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ విగ్రహాలను ప్రోచాహించాలని కాలుష్య నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మట్టి విగ్రహాలు సహజంగా కరిగి పోయి నీరు, నేల స్వచ్ఛతను కాపాడతాయని, అందువల్లన ప్రతి కుటుంబం ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి అని సూచించారు. స్వచ్చంద సంస్థలు ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ రక్షణకు తోడ్పాటును అందించిన స్వచ్చంద సంస్థలకు సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్,మాధురి, డిఆర్ ఓ పద్మజ రాణి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తోపాజి అనంతకిషన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment