నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన బిజెపి నాయకులు

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా శివంపేట్ మండల్ రత్నాపూర్ గ్రామంలో అంగన్ వాడి కేంద్రంలో ఎలుక పడిన నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పరామర్శించి ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అదేవిధంగా హాస్పటల్ సూపరిండెంట్, డాక్టర్స్ తో మాట్లాడి విద్యార్థుల బాగోగులు తెలుసుకోకున్నారు. అదే విధంగా హాస్పటల్ లో ఉన్న సమస్యలను కూడా సూపరిండెంట్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, శివంపేట మండల బిజెపి అధ్యక్షుడు పెద్దపులి రవి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శిలు సంగసాని రాజు, రామ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బిక్షపతి, అశోక్ సదుల్లా, బాలరాజు, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బబ్బురి కృష్ణ, బూత్ అధ్యక్షుడు ఈశ్వర్, బిజెపి నాయకులు నర్సారెడ్డి, అశోక్, బిక్షపతి, రాంసింగ్ నాయక్, సుధాకర్, రత్నాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment