ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం క్షణమే ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని సంగారెడ్డి స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సోమవారం సంగారెడ్డి స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబరు 1న సీపీఎస్ విద్రోహ దినంగా ప్రకటించారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ప్రతి జిల్లాలో ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు చేయాలని కోరారు. అదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు 30సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు సర్వీస్ పూర్తిగా ప్రభుత్వానికి ఒక ఉద్యోగస్తుడిగా ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలను అమలు పరచడంలో ముందుండి ప్రభుత్వానికి.. అటు ప్రజలకు వారధిగా వివరించే ఉద్యోగస్తులకి ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన పెన్షన్ రాకపోతే అతని జీవితం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. పెన్షన్ విద్రోహ దినాన్ని జరుపుకోవాలని ముందుండి పోరాడాల్సిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment