సంగారెడ్డిసంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినాయకుని దర్శించుకున్న కాట శ్రీనివాస్ గౌడ్
Published On: September 4, 2025 10:14 am