తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య…

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య…

ఉత్స‌వాల‌కు హాజ‌రైన ఎంపీ కడియం కావ్య గిరిజ‌నుల‌తో క‌లిసి ఆడిపాడారు..

గిరిజ‌న సంప్ర‌దాయ వ‌స్త్రాన్ని త‌ల‌పై ధరించి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

IMG 20240825 WA0103

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్‌ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని వరంగల్ పార్లమెంట్ సభ్యరాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ గిరిజన భవన్ లో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య గారు మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్‌ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.శ్రావణ మాసంలో 9 రోజుల పాటు గిరిజన యువతులు తమ సంప్రదాయక పద్ధతుల్లో కుటుంబాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు. చివరి రోజున గోధుమ గడ్డి మొలకలు అందుకు ప్రతీకగా భావించి ఉత్సవాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భిన్నత్వాలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతుల్లో సర్వమానవాళి శ్రేయస్సు, పర్యావరణహితం కోసం ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. బంజారాల ఆత్మగౌరవం కోసం విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లోరాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, గిరిజనులంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగి సుస్థిరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బంజారాలు మాట్లాడే ‘ గోరోబోలీ’ భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడానికి కృషి చేస్తానన్నారు. హనుమకొండ లోని గిరిజన భవన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గోర్ బంజారా తీజ్ ఉత్సవ కమీటీ సభ్యులు వి.ఎన్ నాయక్, వినోద్ లోక్ నాయక్, సజ్జన్ నాయక్, మదన్ నాయక్ సీనియర్ జర్నలిస్ట్ బానోత్ వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now