మెదక్/నార్సింగి, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి మాజీ ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశంగౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,.. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు అపారమని, ఆయన చూపిన అహింసా మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి తరాలు గాంధీ సిద్ధాంతాలను అవలంబించి నడిస్తేనే సమాజంలో శాంతి, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
నార్సింగిలో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశంగౌడ్
Published On: October 2, 2025 1:45 pm