సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెవు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఉమ్మడి సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పెద్దలు, గురు సామానులు కుర్ర సత్యనారాయణ జన్మదినం సందర్భంగా గూడెం మధుసూదన్ తో కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సీసాల రాజు నివాసానికి వెళ్లి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో నూతనంగా ప్రారంభమైన “వారాహి టీ అండ్ స్నాక్స్” షాప్ను మాదిరి ప్రిథ్వీరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మంచి మార్గాలను ఎంచుకోవాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని, యువతకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
పలు కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్
Updated On: October 2, 2025 5:45 pm