గజ్వేల్/జగదేవపూర్, అక్టోబర్ 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం 6గంటల సమయంలో పీర్లపల్లి గ్రామానికి చెందిన దేవి మహిపాల్ అనే వ్యక్తి గొర్రెలు మేపుతుండగా.. పాత భూ వివాదాలు మనసులో పెట్టుకున్న జగదేవపూర్ కు చెందిన బచ్చలి ఎల్లయ్య, మహేష్, మల్లయ్యలు కర్రతో దేవీ మహిపాల్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయగా.. నిందితులపై జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం నమోదు చేశారు. శుక్రవారం విచారణ నిమిత్తం సంఘటనా స్థలానికి వచ్చిన గజ్వేల్ ఏసీపీ నరసింహులు, జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీసులు విచారణ చేశారు.
మహిపాల్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
Published On: October 3, 2025 9:23 pm