సాంకేతిక శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఏటిసి సెంటర్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా సౌకర్యాలు, సెంటర్‌లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏ ఏ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణ పై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో అందిస్తున్న అధునాతన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శిక్షణలో మంచి నైపుణ్యం సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఏటీసీ సెంటర్ లో ఉన్న మౌలిక సదుపాయాలు అవసరాల పై సమగ్రంగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment