సమాచార హక్కు చట్టం పై అవగాహన: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార, సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం – 2005పై జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం ఆవశ్యకమని, సమాచార హక్కు చట్టం నిర్వహణలో పారదర్శకత ప్రామాణికమని, అభ్యర్థులు దరఖాస్తు ద్వారా కోరిన సమాచారాన్ని చట్టం నిబంధనలకు లోబడి అధికారులు వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం, అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార, సహాయ ప్రజా సమాచార అధికారుల వివరాలతో బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని అన్నారు. ఈ చట్టం అమలు ద్వారా పని సామర్థ్యం పెరుగుతుందని, దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా అందించాలని తెలిపారు. ఈ చట్టంలో పొందుపర్చిన మినహాయింపులు తప్ప మిగతా అన్ని విషయాల్లో ప్రజలు కోరిన సమాచారాన్ని చట్టం ప్రకారం అందించాలని, సమాచార హక్కు చట్టం 2005 ద్వారా సామాన్య ప్రజలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం తెలుసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఈ చట్టం కింద వచ్చిన ఈ చట్టం కింద వచ్చిన దరఖాస్తులను నిర్మిత గడువు లోగా సమాచారం అర్జీదారులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment