సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారానికై గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, యస్.హెచ్.ఓలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. మీ సమస్యలకు స్థానికంగా పరిష్కారం దొరకనప్పుడు, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అన్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం దొరకని సందర్భంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, స్వచ్ఛందంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో పొందుపరుస్తూ, కేసు యొక్క స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.., ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు. ప్రజల సమస్యలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: October 13, 2025 7:21 pm