రామకృష్ణను అభినందించిన డీఈవో వెంకటేశ్వర్లు

సంగారెడ్డి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణను ప్రత్యేకం గా అభినందించారు.వివరాలలోకి వెలితే.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీచర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్ (నీపా న్యూఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ లీడర్షిప్ అకాడమీ తెలంగాణ ట్రయల్ బ్లేజర్స్ 2025 పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం లో సదాశివపేట మండల నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణకు, అదే పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాలు సునీతకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment