స్విమ్మర్ ఎమ్.ఎ.రెహమాన్ కు ఇర్ఫానీ అవార్డు

సంగారెడ్డి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్విమ్మింగ్ లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించి విజయవాడ, బెంగళూర్ లో జాతీయ స్థాయిలో పాల్గొన్న సంగారెడ్డి పట్టణానికి చెందిన యువ స్విమ్మర్ మహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధీఖ్ కు ఇర్ఫాని దర్గా పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ, స్థానిక ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతా సాయినాథ్, టీయుడబ్ల్యూజే- ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకె.పైసల్ చేతుల మీదగా ఇర్ఫానీ అవార్డును అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత క్రీడలలో ముందుకు సాగి రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. స్విమ్మింగ్ లో ప్రతిభ కనబరిచిన ఎమ్.ఎ.రెహమాన్ క్రమశిక్షణతో, కష్టపడి సాధించిన విజయం అందరికీ ఆదర్శమని అభినందించారు. పేద కుటుంబం నుంచి వచ్చి మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించిన మహమ్మద్ ఒబేద్ కు అదేవిధంగా స్విమ్మింగ్ లో ప్రతిభ కనబరిచిన మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్ లకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున 30వేల రూపాయలు ఖాక్ ఎ తైయిబా ఫౌండేషన్ తరపున మహమ్మద్ అలీ అసీర్ సాహాబ్ నగదు పురస్కారాన్ని అందజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment