కందిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

సంగారెడ్డి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది గ్రామ పంచాయతీలో అక్రమ అనుమతులు, కేకేఆర్ శిల్ప వెంచర్ కు ఇచ్చిన ఎన్ వోసీ అనుమతులను రద్దు చేయాలని కంది గ్రామ మాజీ వార్డు సభ్యుడు ఆనందరావు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కందిలో అధికారులు భవనాలు, వెంచర్లు, అపార్టుమెంట్లకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని, ఈ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బిల్ కలెక్టర్ మల్లేశం రాజీనామా చేసిన కూడా జిల్లా అధికారులు ఆమోదించడం లేదని అన్నారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ వార్డు సభ్యుడు ఆనందరావు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment