వారానికి మూడు సదరం క్యాంపులు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వారానికి మూడు సార్లు సదరం క్యాంపు ఏర్పాటు చేసి ప్రతి రోజు వంద మందికి సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్ లైన్ లో నమోదు చేసి ధ్రువపత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు. సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగుల సదరం క్యాంపులు ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని తెలిపారు. సదరం క్యాంపులో పాల్గొనడానికి ఇప్పటి వరకు 1249మంది ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెలలో 14,16,18 21, 23, 25,28,30 తేదీల్లో సదరం క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఇంకా క్యాంపులు ఏర్పాటుచేసి పెండెన్సుని పూర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులందరికీ సదరం సేవలు అందించేలా క్యాంపులు ఏర్పాటు చేసి, పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి జ్యోతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితాకుమారి, జిల్లా వైద్యాధికారి నాగనిర్మల, జిజిహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment