సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగ రోజు చిన్నారులకు ఆనందం పంచుతూ వస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్. ఈ సంవత్సరం కూడా అదే ఆనందాన్ని పునరావృతం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఉంటున్న అనాధ చిన్నారులకు టపాకాయలు పంపిణీ చేస్తూ, వారు ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాలు సమాజంలో ఆనందం, సానుకూలతను పెంపొందించడంలో సహాయ పడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. చిన్నారుల చిరునవ్వు కన్నా విలువైనది ఏమీ లేదని, వారి ఆనందం నాకు దీపావళి వెలుగుల్లా అనిపిస్తుందని చెప్పారు. చిన్నారులు హర్షంతో ప్రిథ్వీరాజ్ కు థాంక్యూ అన్నా… హ్యాపీ దీపావళి అని కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారులతో దీపావళి సంబరాలు నిర్వహించిన మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: October 21, 2025 6:55 pm