13శాతం హెచ్ఆర్ఏపై కలెక్టర్ కు టీఎన్జీవో ప్రాతినిధ్యం

సంగారెడ్డి అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): కొండాపూర్ మండల పరిధిలో 13శాతం హెచ్ఆర్ఏ పరిధిలోకి వచ్చే గ్రామాలపై చర్యలు వేగవంతం చేయాలని టీఎన్జీవో జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేసింది. ఈ గ్రామాలపై సర్వే నిర్వహించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపి, వారి నివేదిక ఆధారంగా అడిషనల్ కలెక్టర్ కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ, సంబంధిత ఫైల్ కలెక్టర్ కార్యాలయానికి చేరడంలో ఆలస్యం జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎం.డి.జావిద్ అలీ ఆధ్వర్యంలో మరోసారి జిల్లా కలెక్టర్ ను కలసి ప్రాతినిధ్యం అందజేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి, ఫైల్‌ను ఎండార్స్ చేసి డిటిఓకు పంపించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వి.రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.లక్ష్మయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి డి.జగన్నాథం, కొండాపూర్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా కౌన్సిలర్ టి.నర్సింలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, సాంబశివుడు, రాములు, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment