రక్తదానం చేయండి.. ప్రాణ దాతలుగా నిలవండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం/పోలీస్ ఫ్లాగ్ డే”వారోత్సవాలలో శనివారం సంగారెడ్డి జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, నాతో పాటుగా అధికారులు, సిబ్బంది, సంగారెడ్డి పట్టణ ప్రజలు వివిధ సంఘాలకు చెందిన యువకులు స్వచ్చందంగా పెద్ద ఎత్తున వచ్చి రక్త దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 114 యూనిట్ల బ్లడ్ ను సేకరించడం జరిగిందన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, మీరు చేసే ఈ రక్త దానం ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగ పడుతుందన్నారు. కులమత భేదం లేని, గ్రూపులు మాత్రమే కలిగి వున్న ఈ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టే రక్తానికి ఉన్న విలువ అపారమైనదని, అందువల్ల ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడే రక్త ప్రధాతలుగా నిలవాలని ఎస్పీ సూచించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీతో పాటు, అదనపీ ఎస్పీ రఘునందన్ రావు, ఏఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు, మెడికల్ అధికారి వెంకట రామ్, పోలీస్ డాక్టర్ జ్యోతి, ఆర్.ఐ.లు, రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, పోలీస్ సిబ్బంది, బ్లడ్ బ్యాంకుకు చెందిన రాజు, విజయ్, పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment