సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కేకే భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో వరుస ఘటనలు జరుగుతున్నా, జిల్లా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర టాస్క్ పోర్స్ అధికారుల నివేదిక బయట పెట్టాలని అన్నారు. ఇప్పటికే జిల్లా లో 17 ప్రైవేట్ ఆసుపత్రులకు జరిమానా వేసినట్టు వార్తలు వస్తున్నాయని, 25 మంది నకిలీ వైద్యులను ఐఎంఏ గుర్తిస్తే జిల్లా ఆరోగ్య అధికారులు ఎం చేస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికారులు తనిఖీలు చేస్తుంటే జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మందులు, టెస్ట్ లకు అంతు లేకుండా ఉన్నదని అన్నారు. ల్యాబ్, స్కానింగ్ సెంటర్లను కూడా పర్యవేక్షణ చేయాలనీ, కనీసం స్కానింగ్ మెషిన్ కూడా తనిఖీ చేయటం లేదంటే ఆరోగ్య శాఖను వెంటనే మంత్రి ప్రక్షాళన చేయాలని తెలిపారు. లేనిచో ఆందోళన చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమం సీపీఎం నాయకులు మాణిక్యం, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
Published On: October 26, 2025 4:52 pm