సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో గల ఎపిటోరియా యూనిట్-1 పరిశ్రమలో గల సాల్వెంట్ రికవరీ బ్లాక్ సమీపంలో శనివారం రాత్రి మంటలు వ్యాపించాయి. పరిశ్రమ లో కార్మికులు రాత్రి 10గంటలకు విధుల్లో చేరి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాగా సాల్వెంట్ రికవరీ బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. కొందరు కార్మికులు భయంతో పరుగులు తీయగా, సేఫ్టీ సిబ్బందితో పాటు మరికొంత మంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది.. అక్కడి కార్మికులకు ఎవరికైనా ఏదైనా జరిగిందా.. అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
బోర్పట్ల ఎపిటోరియా పరిశ్రమలో అగ్ని ప్రమాదం..
Published On: November 8, 2025 11:19 pm