సంగారెడ్డి, డిసెంబర్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 20న సంగారెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ సన్మాన సభలో మాజీ మంత్రి హరీష్ రావు విజేతలను సన్మానిస్తామని, ఇది బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయి నాయకులకు మరింత ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం అని అన్నారు. ప్రజల నమ్మకంతో గెలిచిన ప్రతినిధులను గౌరవించడం పార్టీ సంప్రదాయం అని తెలిపారు. అలాగే ఈ సన్మాన కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింతా ప్రభాకర్ కోరారు.
ఈనెల 20న సంగారెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాక: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On: December 19, 2025 9:00 pm