సిద్దిపేట/గజ్వేల్, డిసెంబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి జన్మదినాన్ని సిద్దిపేట జిల్లా జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మరాటి కృష్ణమూర్తి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో స్నేహ లైన్స్ క్లబ్ సహకారంతో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులు, గౌరవం కోసం నిరంతరం పోరాడుతున్న బింగి స్వామి సేవలు అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, సేవాభావంతో కూడిన ఈ జన్మదినం మరెందరికో ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేయూ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి, రాష్ట్ర నాయకులు సిద్దల రవి, బైరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి బింగి స్వామి జన్మదిన వేడుకలు
Published On: December 21, 2025 9:04 pm