ముత్తంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు

పటాన్ చెరు, డిసెంబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్.రాజేష్ మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావం మరియు సేవాభావానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థులు ఈ విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు క్రిస్మస్ గీతాలు, నాటికలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి అందరినీ అలరించారు. చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణను క్రిస్మస్ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment