బషీర్బాగ్ విద్యుత్ పోరాట ఫలితమే నేడు రైతులకు ఉచిత విద్యుత్

బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల త్యాగ ఫలితమే నేడు రైతులకు ప్రజలకు ఉచిత కరెంటు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాల స్వామి.

సిద్దిపేట ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

2000 సంవత్సరంలో విద్యుత్ ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహించిన పోరాటంలో బషీర్బాగులో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వాములకు సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యాలయంలో నివాళులర్పించి అనంతరం విద్యుత్ అమరవీరుల సభలో జిల్లా గోపాల స్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను అమల్లో భాగంగా రాష్ట్ర విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేయగా విద్యుత్ ప్రవేటీకరణ ఆపాలని రైతులకు పేదలకు విస్తరణ ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు నెలల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన మద్దతు లభించింది. ప్రభుత్వం ప్రజలు చేస్తున్న ఆందోళన పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్లడానికి ప్రయత్నం చేయగా వామపక్ష పార్టీలు 2000 సంవత్సరం ఆగస్టు 28న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా బషీర్బాగ్ చౌరస్తా వద్ద నిరసన చెబుతున్న వామపక్ష పార్టీల కార్యకర్తలు ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం పాసవికంగా కాల్పులు జరిపించింది ఈ కాల్పుల్లో కామ్రేడ్ రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ పోరాటంలో అమరులైనారు.
అనేకమంది కి గాయాలైనాయి వేల మంది మీద చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. ఈ పోరాట ఫలితంగా ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేసింది
అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది దాంతోపాటు విద్యుత్ ప్రైవేట్ ఈకరణను నిలిపివేసినారు ప్రస్తుతం పేద ప్రజలకు ఇండ్లలోకి కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు సిపిఎం విద్యుత్ పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు సంస్కరణలు కూడా అమలు చేయడంలో ఆనాటి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కానీ వీడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విద్యుత్తును మొత్తం అంబానీ ఆదానికి అప్పజెప్పి దేశాన్ని రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు విద్యుత్ ప్రయోగికన జరిగితే దేశంలో రైతులకు ప్రజలకు విద్యుత్తు పూర్తిస్థాయిలో అందుదన్నారు ఉద్యోగస్తులకు ఉద్యోగ భరోసా ఉండదన్నారు కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి అన్నారు బిజెపి చేస్తున్న బొగ్గు గనుల ప్రైవేటు ఈకరణను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు రాబోయే కాలంలో విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్, చెప్పాల సంతోష్, బత్తుల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now