చిదురుప్పలో ఘనంగా బోనాల వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 ,(ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప్ప గ్రామంలో బోనాల వేడుకలు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. డప్పు వాయిద్యాలతో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు వేషాదారులతో ప్రదర్శనలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుగౌడ్, కంది మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, చిమ్నాపూర్ మాజీ సర్పంచ్ పాండు, కంది మండల శ్రీరామ్, మురారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now